[అటవీ నేపథ్యం]
హోమ్ Home
[వెలుగు చిహ్నం]

గూడెం గ్రామ ప్రగతి: 78 ఏళ్ల చీకటి నుంచి వెలుగులోకి Gudem Village Development: 78 Years of Darkness to Light

గూడెం గ్రామానికి విద్యుత్ కాంతులు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో 15 రోజుల్లో అద్భుతం. Gudem village sees light. A 15-day miracle initiated by Dy. CM Sri Pawan Kalyan.

కథనాన్ని చదవండి Read the Story

పరిచయ వీడియో Introductory Video

గ్రామం యొక్క మునుపటి పరిస్థితి. The village's previous situation.

స్వాతంత్య్రం నుండి నిరీక్షణ A Wait Since Independence

78 ఏళ్ల స్వాతంత్ర్యం సిద్ధించినా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి పంచాయతీలోని గూడెం గ్రామం మూడు తరాలుగా కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. For 78 years since independence, Gudem village in Rompalli Panchayat, Ananthagiri Mandal, Alluri Sitharama Raju Dist., has lived without basic amenities for three generations.

పాలకుల నిర్లక్ష్యానికి గురై, ఈ గిరిజన గ్రామం త్రాగునీరు, సాగునీరు మరియు సరైన రహదారి లేక అల్లాడిపోయింది. రాయపూర్-విశాఖపట్నం నేషనల్ హైవేకు కూతవేటు దూరంలో ఉన్నా, అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. Due to rulers' negligence, this tribal village suffered without drinking water, irrigation, or proper roads. Despite being near the Raipur-Visakhapatnam National Highway, it remained miles away from development.

వర్షాకాలంలో బురద నీరు తప్ప మంచినీరు దొరకని పరిస్థితి. విద్యుత్ లేక రాత్రి వేళ వంట చేసుకోవడానికి, పిల్లలు చదువుకోడానికి వీలులేని దుస్థితి. In the rainy season, they had no choice but to drink muddy water. Without electricity, cooking at night and studying was impossible.

ఈ కారణాలవల్ల ఎంతో మంది యువత గ్రామాన్ని విడిచి వలస వెళ్లిపోయారు. Due to these hardships, many youths migrated from the village.

మొదటి అడుగు & విజ్ఞప్తి First Step & The Appeal

ఈ దుస్థితిని చూసి, జనసేన సేవాదళ్ మాజీ ఇంచార్జ్ మరియు సోషియో ఎకనామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్, వన్నెంరెడ్డి సతీష్ కుమార్ గారు మొదటగా గ్రామానికి సోలార్ విద్యుత్ దీపాలను పంపిణీ చేశారు. Seeing this plight, Vennemreddy Satish Kumar, former in-charge of Jana Sena Sevadal and Chairman of the Socio-Economic Research Foundation, first distributed solar lamps to the village.

శాశ్వత పరిష్కారం కోసం, గ్రామ ప్రజలు పక్కా పాఠశాల, త్రాగునీటి వసతి, అంగన్వాడి కేంద్రం, మరియు రహదారి కల్పించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారిని అభ్యర్థించారు. For a permanent solution, the villagers appealed to the Hon'ble Dy. CM Sri Pawan Kalyan to provide a proper school, drinking water, an Anganwadi center, and road facilities.

కొత్త కాంతులు: 15 రోజుల అద్భుతం New Light: The 15-Day Miracle

ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన చొరవతో, విద్యుత్ శాఖ కేవలం 15 రోజుల్లోనే అద్భుతాన్ని ఆవిష్కరించింది. Hon'ble Deputy CM Sri Pawan Kalyan took special interest in this matter. With his initiative, the electricity department achieved a miracle in just 15 days.

  • » 17 కుటుంబాల కోసంfamilies
  • » 10 కి.మీ మేర లైన్km long line
  • » 217 విద్యుత్ స్తంభాలుelectric poles
  • » రూ.80 లక్షల వ్యయంతోlakhs cost

తమ గ్రామానికి కరెంటు లైను వేయించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, గ్రామస్తులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. To express their gratitude, the villagers performed a 'Palaabhishekam' (milk offering) on Sri Pawan Kalyan's photo for electrifying their village.

Related News: 75 Years of Independence: Pawan Brings Power to Forgotten Gudem

ఒక ప్రత్యేక వీడియో A Special Video

గ్రామస్తుల ఆనంద క్షణాలు మరియు కృతజ్ఞతలు. Moments of joy and gratitude from the villagers.

శాసనసభలో ప్రస్తావన In Andhra Pradesh Legislative Assembly

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి XVI ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఐదవ సమావేశంలో ప్రసంగం. AP Deputy CM Sri Pawan Kalyan speech at Fifth Session of XVI Andhra Pradesh Legislative Assembly.

గ్యాలరీ Gallery

మరిన్ని నివేదికలు & కార్యక్రమాలు More Reports & Initiatives